రష్యా నౌకను ఇలా సీజ్ చేశారు.. వీడియో ఇదిగో!
- హెలికాప్టర్ లో నౌకపై దిగిన అమెరికా భద్రతా బలగాలు
- ఐస్‌లాండ్ దక్షిణ తీరానికి 190 మైళ్ల దూరంలో నౌక స్వాధీనం
- అమెరికా ఆపరేషన్ కు బ్రిటన్ సహకారం
ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో రష్యా జెండాతో వెళుతున్న వెనెజువెలా చమురు నౌకను అమెరికా సీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ నౌకను స్వాధీనం చేసుకున్న వీడియోను అమెరికా కోస్ట్ గార్డ్ విడుదల చేసింది. అంతర్జాతీయ చట్టాలను పరిరక్షించడంలో అమెరికా నిరంతరం కృషి చేస్తోందని పేర్కొంటూ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రక్షణ శాఖతో కలిసి తీర రక్షక దళం సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించిందని, బ్రిటన్ కూడా సహకరించిందని తెలిపింది.
ఐస్‌లాండ్ దక్షిణ తీరానికి 190 మైళ్ల దూరంలో రష్యా నౌక మ్యారినెరా (పాత పేరు బెల్లా-1) ను స్వాధీనం చేసుకున్నట్లు అమెరికా కోస్ట్ గార్డ్ తెలిపింది. హెలికాప్టర్ నుంచి తమ భద్రతా బలగాలు నౌకపై దిగి సిబ్బందిని అదుపులోకి తీసుకున్నాయని వివరించింది. దీంతోపాటు ఏ దేశపు జెండాలేని మరో నౌక సోఫియాను కూడా సీజ్ చేసినట్లు వివరించింది.