అట్లాంటిక్ మహా సముద్రంలో ఉద్రిక్తత.. అమెరికాకు రష్యా వార్నింగ్

  • యూఎస్ పడవలను ముంచేయాల్సి వస్తుందన్న రష్యన్ నేత
  • అతివిశ్వాసంతో అమెరికా విర్రవీగుతోందని మండిపాటు
  • రష్యా జెండాతో ప్రయాణిస్తున్న చమురు నౌకను సీజ్ చేసిన అమెరికా
అతి విశ్వాసంతో విర్రవీగుతూ అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కుతోందంటూ అమెరికాపై రష్యా మండిపడింది. ఇదే తీరును కొనసాగిస్తే ప్రతీకార దాడులకు దిగాల్సి వస్తుందని, అమెరికా నౌకలను సముద్రంలో ముంచేస్తామని తీవ్రంగా హెచ్చరించింది. ఈ మేరకు ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో రష్యా జెండాతో ప్రయాణిస్తున్న వెనెజువెలా చమురు నౌకను అమెరికా దళాలు సీజ్ చేయడంపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది.

అమెరికా చర్యతో ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ పరిణామంపై రష్యా చట్టసభ్యుడు అలెక్సీ జురావ్లెవ్‌ స్పందిస్తూ.. అమెరికా తన తీరు మార్చుకోకుంటే ప్రతీకార దాడులు తప్పవని హెచ్చరించారు. అంతర్జాతీయ చట్టాలను గౌరవించకుంటే మిలిటరీ దాడులను ఎదుర్కోవాల్సి వస్తుందని, టార్పిడో దాడులు, అమెరికా కోస్ట్ గార్డ్ నౌకలపై దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.


More Telugu News