నిఖిత కుటుంబానికి సహాయం చేస్తాం: కిషన్ రెడ్డి

  • ఆమెరికాలో గోడిశాల నిఖిత హత్యపై విచారం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
  • విషయం తెలియగానే విదేశాంగ మంత్రి జైశంకర్‌తో మాట్లాడానన్న కిషన్ రెడ్డి
  • అవసరమైన అన్ని విధాల సహాయాన్ని అందిస్తున్నామని వెల్లడి 
హైదరాబాద్‌కు చెందిన గోడిశాల నిఖిత (27) అమెరికాలో హత్యకు గురైన ఘటనపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. నిఖిత కుటుంబం తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని తార్నాక విజయపురి కాలనీలో ఉంటోందని అన్నారు.

నిఖిత మృతి విషయం తెలియగానే తాను జర్మనీ పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి జైశంకర్‌తో మాట్లాడి, మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు అవసరమైన సహకారం అందించాలని కోరడం జరిగిందన్నారు. ఈ విషయంలో ఢిల్లీలోని తన కార్యాలయం, తెలంగాణ బీజేపీ కార్యాలయం నిఖిత కుటుంబ సభ్యులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తూ అవసరమైన సహాయాన్ని అందిస్తోందని కిషన్‌రెడ్డి తెలిపారు. 


More Telugu News