ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు

  • సభా హక్కుల ఉల్లంఘన కింద ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలు
  • ఎత్తిపోతల, కృష్ణా జలాల్లో ఒప్పందంపై తప్పుదోవ పట్టించారని పేర్కొన్న ఎమ్మెల్యేలు
  • సభాపతి సూచనల మేరకు శాసన సభ కార్యదర్శికి నోటీసులు అందజేత  
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. నదీ జలాలపై చర్చ సందర్భంగా సభను తప్పుదోవ పట్టించారని పేర్కొంటూ సభా హక్కుల ఉల్లంఘన కింద ఫిర్యాదు చేశారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం మినిట్స్, రాయలసీమ ఎత్తిపోతల పనుల నిలిపివేత, కృష్ణా జలాల్లో తాత్కాలిక ఒప్పందంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుదోవ పట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

సభాపతి సూచన మేరకు ఎమ్మెల్యేలు శాసనసభ కార్యదర్శి రెండ్ల తిరుపతిరెడ్డికి నోటీసులు అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు చేపట్టాలని కోరుతూ అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో కేపీ వివేకానంద్, కోవ లక్ష్మి తదితరులు ఉన్నారు.


More Telugu News