Palakollu Couple: అమెరికాలో ఘోర ప్రమాదం.. పాలకొల్లు జంట దుర్మరణం

Palakollu couple Krishna Kishore dies in Washington car crash
  • పది రోజుల క్రితమే పాలకొల్లు వచ్చి వెళ్లిన భార్యాభర్తలు
  • వాషింగ్టన్ లో వారు ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం
  • స్పాట్ లోనే భార్యాభర్తల మృతి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పిల్లలు
అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాలకొల్లుకు చెందిన భార్యాభర్తలు దుర్మరణం చెందారు. తీవ్ర గాయాలపాలైన వారి పిల్లలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన కృష్ణ కిశోర్, ఆశ దంపతులు అమెరికాలో స్థిరపడ్డారు. కృష్ణ కిశోర్ పదేళ్లకు పైగా అక్కడే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. వారు పది రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చి వెళ్లారు. తిరిగి వెళ్లే క్రమంలో దుబాయ్ లో ఆగి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు.

ఇంతలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో కృష్ణ కిశోర్ కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. వాషింగ్టన్ లో కృష్ణ కిశోర్ కుటంబం ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కృష్ణ కిశోర్, ఆశ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మరణించారని అమెరికా పోలీసులు తెలిపారు. వారి కుమార్తె, కుమారుడికి తీవ్రగాయాలయ్యాయని, వారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు కృష్ణ కిశోర్ కుటుంబ సభ్యులకు అమెరికా పోలీసులు సమాచారం అందించారు.
Palakollu Couple
Washington accident
Andhra Pradesh
Road accident
US accident
Software engineer
West Godavari district
Indian couple
New Year celebrations
Krishna Kishore

More Telugu News