బంగ్లాదేశ్‌లో దాడికి గురైన హిందూ వ్యాపారి మృతి

  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఖోకన్ చంద్ర దాస్ మృతి
  • షరియత్‌పూర్ జిల్లాలోని క్యూర్‌బంగా బజార్‌లో ఖోకన్‌పై దుండగుల దాడి
  • దుండగుల నుంచి తప్పించుకునే క్రమంలో చెరువులో దూకిన ఖోకన్
బంగ్లాదేశ్‌లోని షరియత్‌పూర్ జిల్లా, క్యూర్‌బంగా బజార్‌లో ఫార్మసీ నిర్వహిస్తున్న హిందూ వ్యాపారి ఖోకన్ చంద్ర దాస్, ఢాకాలోని నేషనల్ బర్న్ ఇన్‌స్టిట్యూట్‌లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మరణించారు. ఇటీవల ఖోకన్ చంద్ర దాస్‌పై కొందరు దుండగులు దాడి చేసి నిప్పంటించగా, వారి నుంచి తప్పించుకునేందుకు ఆయన చెరువులో దూకారు. పోలీసులు, స్థానికులు ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు.

చంద్రదాస్ క్యూర్‌బంగా బజార్‌లో ఔషధాలు, మొబైల్ బ్యాంకింగ్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. దుకాణం మూసి ఆటోలో ఇంటికి వెళుతుండగా, మార్గమధ్యంలో కొందరు దుండగులు ఆటోను ఆపి, పదునైన ఆయుధాలతో ఆయనపై దాడి చేశారు. అనంతరం ఆయన తలపై పెట్రోల్ పోసి నిప్పంటించగా, వారి నుంచి తప్పించుకునేందుకు ఖోకన్ రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దూకారు. స్థానికులు ఆయనను కాపాడి ఆసుపత్రికి తరలించారు.

విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హాదీ హత్యతో దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో హిందువులపై హత్యాకాండా సాగుతోంది. ఇటీవల దీపూ చంద్ర దాస్ హత్య జరిగింది. ఆ తర్వాత సామ్రాట్ అనే వ్యక్తి గ్రామస్థుల మూకదాడిలో మృతి చెందాడు. అనంతరం బజేంద్ర బిశ్వాస్ అనే మరో వ్యక్తిని సహోద్యోగి కాల్చి చంపాడు. ఆ తర్వాత ఖోకన్‌పై దాడి జరిగింది.


More Telugu News