Tirumala Laddoo: శ్రీవారి లడ్డూ విక్రయాల్లో ఆల్ టైమ్ రికార్డు.. 2025లో 13.52 కోట్ల అమ్మకాలు
- 2025లో రికార్డు స్థాయిలో శ్రీవారి లడ్డూల విక్రయాలు
- మొత్తం 13.52 కోట్ల లడ్డూలను విక్రయించిన టీటీడీ
- 2024తో పోలిస్తే 1.37 కోట్ల లడ్డూలు అదనం
- భక్తుల రద్దీ, నాణ్యతపై నమ్మకమే అమ్మకాలు పెరగడానికి కారణం
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాల్లో సరికొత్త రికార్డు నమోదైంది. 2025 సంవత్సరంలో ఏకంగా 13.52 కోట్ల లడ్డూలను భక్తులకు విక్రయించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారికంగా ప్రకటించింది. గత దశాబ్ద కాలంలో ఇదే అత్యధిక విక్రయాల రికార్డు కావడం విశేషం. 2024లో విక్రయించిన 12.15 కోట్ల లడ్డూలతో పోలిస్తే, 2025లో అమ్మకాలు 10 శాతం పెరిగాయి. అంటే, గత ఏడాదితో పోలిస్తే అదనంగా 1.37 కోట్ల లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు.
ఈ మేరకు టీటీడీ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ జనవరి 1న ఓ ప్రకటన విడుదల చేశారు. "2025 సంవత్సరంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాలు రికార్డుస్థాయిలో విక్రయించబడ్డాయి. 2024వ సంవత్సరంతో పోల్చితే 10 శాతం అధికంగా లడ్డూలను భక్తులకు విక్రయించడం జరిగింది. గత ఏడాది 12.15 కోట్ల లడ్డూలను విక్రయించగా ఈ ఏడాది 13.52 కోట్ల లడ్డూలను టీటీడీ భక్తులకు విక్రయించింది" అని ఆయన వివరించారు.
ఏడాది పొడవునా తిరుమలకు భక్తుల రద్దీ భారీగా పెరగడం, అదే సమయంలో లడ్డూ ప్రసాదం రుచి, నాణ్యత మెరుగుపడటం వంటివి ఈ రికార్డు స్థాయి విక్రయాలకు ప్రధాన కారణాలుగా టీటీడీ పేర్కొంది. భక్తుల నుంచి లభిస్తున్న ఆదరణకు అనుగుణంగా లడ్డూల ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా టీటీడీ గణనీయంగా పెంచింది. ప్రస్తుతం రోజుకు సగటున 4 లక్షల లడ్డూలను తయారు చేస్తున్నారు. ఇదే క్రమంలో, 2025 డిసెంబర్ 27న ఒక్కరోజే 5.13 లక్షల లడ్డూలను విక్రయించి, దశాబ్ద కాలంలో అత్యధిక ఒక్కరోజు అమ్మకాల రికార్డును కూడా సృష్టించారు.
'శ్రీవారి పోటు'గా పిలిచే ఆలయ వంటశాలలో దాదాపు 700 మంది శ్రీవైష్ణవ బ్రాహ్మణ సిబ్బంది రెండు షిఫ్టుల్లో నిరంతరం లడ్డూలను తయారు చేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాల వంటి పర్వదినాల్లో భక్తుల రద్దీని తట్టుకునేందుకు 8 నుంచి 10 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్‌గా సిద్ధంగా ఉంచుతున్నారు.
కాగా, 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను లడ్డూ, ఇతర ప్రసాదాల విక్రయం ద్వారా రూ. 600 కోట్ల ఆదాయాన్ని టీటీడీ అంచనా వేసింది. కేవలం 2025 జులై నెలలోనే 1.24 కోట్ల లడ్డూల విక్రయం ద్వారా రూ. 62.2 కోట్ల ఆదాయం సమకూరినట్లు గతంలో వెల్లడించింది. తాజా రికార్డులతో ప్రసాదాల ద్వారా వచ్చే ఆదాయం అంచనాలను మించే అవకాశం ఉందని భావిస్తున్నారు.