ప్రియాంక గాంధీ కాబోయే కోడలు ఈ అమ్మాయే!
- ప్రియాంక గాంధీ ఇంట పెళ్లి సందడి
- ప్రియురాలిని మనువాడనున్న ప్రియాంక తనయుడు రైహాన్ వాద్రా
- ఘనంగా నిశ్చితార్థం!
కాంగ్రెస్ అగ్రనాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆమె కుమారుడు రైహాన్ వద్రా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఢిల్లీకి చెందిన తన స్నేహితురాలు అవివా బేగ్‌తో రైహాన్ నిశ్చితార్థం జరిగింది. వీరిద్దరూ గత ఏడేళ్లుగా ప్రేమలో ఉన్నారని, రెండు కుటుంబాల పెద్దల అంగీకారంతో వీరు ఒక్కటవుతున్నారని ఎన్డీటీవీ తన కథనంలో ధృవీకరించింది.
ప్రస్తుతం గాంధీ, వద్రా, బేగ్ కుటుంబాలు రాజస్థాన్‌లోని రణథంబోర్‌లో ఉన్నాయి. అక్కడే నిశ్చితార్థ వేడుకలతో పాటు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నట్లు సమాచారం. రైహాన్, అవివా కుటుంబాల మధ్య ఎప్పటి నుంచో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మూడు రోజుల క్రితం అవివా తన ఇన్‌స్టాగ్రామ్‌లో రైహాన్‌తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ హార్ట్ సింబల్స్ పెట్టడంతో వీరి బంధంపై స్పష్టత వచ్చింది.
ఎవరీ అవివా బేగ్?
అవివా బేగ్ ఢిల్లీకి చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్. ఆమె 'అటెలియర్ 11' (Atelier 11) అనే ఫోటోగ్రాఫిక్ స్టూడియోకి కో-ఫౌండర్‌గా వ్యవహరిస్తోంది. ఢిల్లీలోని మోడరన్ స్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆమె... ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో జర్నలిజం, కమ్యూనికేషన్ కోర్సు పూర్తిచేసింది. ఆమె తీసిన ఫోటోలు ఇండియా ఆర్ట్ ఫెయిర్ సహా పలు ప్రముఖ వేదికలపై ప్రదర్శితమయ్యాయి. కేవలం ఫోటోగ్రఫీ మాత్రమే కాకుండా మీడియా ప్రొడక్షన్, బ్రాండింగ్ రంగాల్లోనూ ఆమె పనిచేసింది.
మరోవైపు రైహాన్ వద్రా కూడా విజువల్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నాడు. పదేళ్ల వయసు నుంచే ఫోటోగ్రఫీపై ఆసక్తి పెంచుకున్న రైహాన్.. వైల్డ్ లైఫ్, స్ట్రీట్ ఫోటోగ్రఫీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తన తల్లి ప్రోత్సాహంతో కళారంగంలో ముందుకు సాగుతున్నాడు.