Supriya Mahamunkar: కొడుకు కావాలని కన్నకూతురిని చంపిన తల్లి... ముంబైలో దారుణం
- కొడుకు కావాలనే కోరికతో ఆరేళ్ల కూతురి హత్య
- నవీ ముంబైలో సైన్స్ గ్రాడ్యుయేట్ దారుణ చర్య
- అనారోగ్యంతో మృతి చెందినట్లు మొదట నాటకం
- పోస్టుమార్టం నివేదికతో బయటపడిన నిజం
- నిందితురాలు మానసిక చికిత్స తీసుకుంటున్నట్లు గుర్తింపు
నవీ ముంబైలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కొడుకు కావాలన్న బలమైన కోరికతో ఓ తల్లి తన ఆరేళ్ల కన్నకూతురిని కిరాతకంగా హత్య చేసింది. సైన్స్ గ్రాడ్యుయేట్ అయిన ఆమెను కళంబోలి పోలీసులు అరెస్ట్ చేశారు.
కళంబోలి ప్రాంతంలోని గురు సంకల్ప్ సొసైటీలో నివసించే సుప్రియా మహామున్కర్ (30) ఈ నెల 23న తన కుమార్తె మాన్సి (6) అనారోగ్యంతో చనిపోయిందని పోలీసులకు తెలిపింది. అయితే, పాప మృతిపై అనుమానం వచ్చిన పోలీసులు పోస్టుమార్టం నిర్వహించారు. ఊపిరాడకుండా చేయడం వల్లే చిన్నారి చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలడంతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.
అనంతరం సుప్రియను అదుపులోకి తీసుకుని విచారించగా తానే నేరం చేసినట్లు అంగీకరించింది. కొడుకు పుట్టాలనే కోరికతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు ఆమె పోలీసుల ఎదుట ఒప్పుకుంది. అంతేకాకుండా, తన కూతురి మాటలు స్పష్టంగా లేవని, మరాఠీ కాకుండా హిందీ మాట్లాడుతోందని కూడా ఆమె అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. నిందితురాలు 2024 నుంచి డిప్రెషన్‌కు చికిత్స తీసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు.
2019లో పాప నెలల వయసులో ఉన్నప్పుడు కూడా ఇలాగే ఊపిరాడకుండా చేసి చంపేందుకు ప్రయత్నించిందని ఆమె భర్త ప్రమోద్ పోలీసులకు చెప్పడం గమనార్హం. ప్రస్తుతం పోలీసులు సుప్రియను కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆమెకు పోలీస్ కస్టడీ విధించింది.