అవతార్-3... ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ!

Avatar 3 Fire and Ash Ready for OTT Streaming
  • గత ఏడాది డిసెంబర్‌లో విడుదలైన అవతార్-3
  • జూన్ 24న డిస్నీప్లస్ వేదికగా స్ట్రీమింగ్
  • అదే రోజున భారత్ లో జియో స్టార్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం
జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన అవతార్-3 ఫైర్ అండ్ యాష్ గత ఏడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా త్వరలో అంతర్జాతీయ ఓటీటీలోకి రానుంది. డిస్నీప్లస్ వేదికగా జూన్ 24వ తేదీన ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుందని వెల్లడిస్తూ, నిర్మాణ సంస్థ పోస్టర్‌ను విడుదల చేసింది.

అవతార్-3 చిత్రం థియేటర్లలో మంచి వసూళ్లను రాబట్టింది. వాస్తవానికి ఈ చిత్రం ఇప్పటికే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో రెంటల్ ప్రాతిపదికన అందుబాటులో ఉంది. జూన్ 24వ తేదీ నుంచి సబ్‌స్క్రిప్షన్ ఉన్న వినియోగదారులకు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండా సినిమాను వీక్షించవచ్చు.

అవతార్-3 భారతదేశంలో జూన్ 24వ తేదీనే జియో హాట్‌స్టార్‌లో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. తెలుగు, హిందీ, తమిళం తదితర భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. భారతదేశంలో ఈ సినిమా ఓటీటీ విడుదలపై ప్రకటన రావాల్సి ఉంది.
Go Back to Shorts
Avatar 3
James Cameron
Avatar The Way of Water
Disney Plus
OTT Streaming
Fire and Ash

More Telugu News