'బంటీ ఔర్ బబ్లీ' స్టైల్‌లో భారీ చోరీ.. ఉద్యోగం పోవడంతో దొంగగా మారిన గ్రాఫిక్ డిజైనర్!
- మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఘటన
- రూ. 16 లక్షల విలువైన నగల అపహరణ
- ఏఐ వల్లే ఉద్యోగం పోయిందన్న నిందితుడు
- నిందితులిద్దరూ 18 ఏళ్ల లోపు వారే
సినిమాల ప్రభావం యువతపై ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. బాలీవుడ్ చిత్రం 'బంటీ ఔర్ బబ్లీ' స్ఫూర్తితో రూ. 16 లక్షల విలువైన బంగారు, వజ్రాభరణాలను దొంగిలించిన 18 ఏళ్ల యువ జంటను మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు గ్రాఫిక్ డిజైనర్ కాగా, మరొకరు నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థిని.
పోలీసుల విచారణలో నిందితుడు విస్తుపోయే విషయాలు వెల్లడించాడు. తానొక ఐటీ కంపెనీలో పార్ట్ టైమ్ గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేసేవాడినని, అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత అందుబాటులోకి రావడంతో కంపెనీ తనను ఉద్యోగం నుంచి తొలగించిందని తెలిపాడు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక, చిన్నప్పటి నుంచి స్నేహితురాలైన నీట్ విద్యార్థినితో కలిసి ఈ చోరీకి పథకం పన్నినట్టు తెలిపాడు.
ఈ నెల 22న ఇండోర్‌లోని రావూ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక జ్యువెలరీ షాపులో వీరు రూ. 16.17 లక్షల విలువైన బంగారం, వెండి, వజ్రాల నగలను అపహరించారు. అనంతరం ఇద్దరూ భోపాల్‌కు పరారయ్యారు. దొంగిలించిన నగలను విక్రయించడానికి ప్రయత్నించగా, చిన్నపిల్లల్లా కనిపిస్తున్నారని కొనుగోలుదారులు సరైన ధర ఇవ్వలేదు. దీంతో క్రిస్మస్ సెలవుల తర్వాత నగలను విక్రయించాలని వారు భావించారు. ఈలోపే పోలీసులు గాలింపు చేపట్టి భోపాల్‌లో వీరిని అదుపులోకి తీసుకున్నారు. అపహరణకు గురైన మొత్తం సొత్తును స్వాధీనం చేసుకున్నారు.