BCCI: బీసీసీఐ గ్రేడ్ 'ఏ'లో గిల్, బుమ్రా, గ్రేడ్ 'బీ'లోకి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ
- ఆటగాళ్ల స్థాయి, ప్రదర్శనను బట్టి ప్రతి సంవత్సరం కాంట్రాక్టుల ప్రకటన
- సీనియర్ క్రీడాకారులు, మహిళా క్రికెటర్ల వార్షిక కాంట్రాక్టులు ప్రకటించిన బీసీసీఐ
- గ్రేడ్ 'ఏ'లో బుమ్రా, గిల్, జడేజా మాత్రమే
బీసీసీఐ 2025-26 (అక్టోబర్ 1, 2025 నుండి సెప్టెంబర్ 30, 2026)కు సంబంధించి వార్షిక సెంట్రల్ కాంట్రాక్టులను ప్రకటించింది. ఆటగాళ్ల స్థాయి, వారు చేస్తున్న ప్రదర్శనను బట్టి బీసీసీఐ ప్రతి సంవత్సరం సెంట్రల్ కాంట్రాక్టులను ప్రకటిస్తుంది. టీమిండియా సీనియర్ క్రీడాకారులు, సీనియర్ మహిళా క్రికెటర్ల వార్షిక ఆటగాళ్ల కాంట్రాక్టులను బీసీసీఐ ప్రకటించింది. సీనియర్ ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను గ్రేడ్ 'బీ'కి తగ్గించారు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టీ20లు, టెస్టులకు వీడ్కోలు పలికి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. శుభ్‌మన్ గిల్, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడెజాలు మాత్రమే గ్రేడ్ 'ఏ'లో చోటు దక్కించుకున్నారు.
గ్రేడ్ 'బీ'లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్, మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, యశస్వి జైశ్వాల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్ ఉన్నారు.
గ్రేట్ 'సి'లో అక్షర్ పటేల్, తిలక్ వర్మ, రింకు సింగ్, శివమ్ దుబే, సంజు శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, ధ్రువ్ జురెల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, సాయిసుదర్శన్, రవి బిష్ణోయ్, రుతురాజ్ గైక్వాడ్ ఉన్నారు.
మహిళల టీమ్‌లో గ్రేడ్ 'ఏ'లో హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మలు, గ్రేడ్ 'బీ'లో రేణుక ఠాకూర్, షెఫాలీ వర్మ, రిచాఘోష్, స్నేహ్ రాణా చోటు దక్కించుకున్నారు. గ్రేడ్ 'సీ' జాబితాలో రాధాయాదవ్, అమన్ జ్యోత్ కౌర్, ప్రతీకా రావల్, క్రాంతి గౌడ్, ఉమా ఛెత్రి, అరుంధతి రెడ్డి, శ్రీచరణి, యస్తికా భాటియా, హర్లీన్ డియోల్, కాశ్వీ గౌతమ్, జి. కమలిని, వైష్ణవి శర్మ, తేజస్ హసబ్నిస్ ఉన్నారు.