కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి పార్థసారథి ఫైర్
- ఏపీకి వస్తున్న పెట్టుబడులపై కేసీఆర్ వ్యాఖ్యలను తప్పుబట్టిన పార్థసారథి
- ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదని మండిపాటు
- రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలనేదే చంద్రబాబు లక్ష్యమని వ్యాఖ్య
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ గురించి, ఏపీకి వస్తున్న పెట్టుబడుల గురించి కేసీఆర్ మాట్లాడిన తీరు అభ్యంతరకరమని మండిపడ్డారు. భాష, యాస, ప్రాసలపై పట్టు ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదని అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఏపీకి వస్తున్న పెట్టుబడులపై మీకు ఏవైనా అనుమానాలు ఉంటే... వాటిని పారదర్శకంగా మీకు చూపిస్తామని కేసీఆర్ కు పార్థసారథి సూచించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టిన వారు తెలంగాణలో కూడా పెట్టుబడులు పెట్టారని చెప్పారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలనేదే తమ ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని... ఈ విషయాన్ని ఆయన ఎన్నోసార్లు చెప్పారని గుర్తు చేశారు. ఐదేళ్ల వైసీపీ విధ్వంసం నుంచి అమరావతిని అభివృద్ధి చేస్తుంటే... మీరు ఇలా మాట్లాడటం తగదని అన్నారు.