ఫిరాయింపులపై చర్చల నడుమ దానం నాగేందర్ కీలక ప్రకటన
- తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని దానం నాగేందర్ స్పష్టీకరణ
- ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తనకు సమాచారం లేదన్న దానం
- జీహెచ్‌ఎంసీలో కాంగ్రెస్, ఎంఐఎం కూటమి విజయం సాధిస్తుందని ధీమా
తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపుల చర్చలు ముదురుతున్న వేళ, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక ప్రకటన చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేసిన ఆయన, ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు? వారు ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారు? అన్న విషయాలు తనకు తెలియవని అన్నారు.
“నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది” అంటూ దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎంఐఎం కలిసి మొత్తం 300 డివిజన్లలో విజయం సాధిస్తాయని ఆయన ధీమా వ్యక్తం వేశారు. గ్రేటర్ హైదరాబాద్ అంతటా విస్తృతంగా ప్రచారం చేస్తానని, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని తెలిపారు.
ఇటీవల బీఆర్‌ఎస్ తరఫున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ గులాబీ పార్టీ పోరాటం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా ఎమ్మెల్యేలు తాము ఇంకా బీఆర్‌ఎస్ పార్టీలోనే ఉన్నామని చెబుతున్నారు. అయితే, ఈ పరిణామాలకు భిన్నంగా దానం నాగేందర్ మాత్రం బహిరంగంగా తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నానని అంగీకరించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.