ప్రభాస్ 'రాజాసాబ్' సెన్సార్ పూర్తి.. 3 గంటలకు పైగా రన్ టైం

  • జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'రాజాసాబ్'
  • సినిమా మొత్తం రన్ టైం 183 నిమిషాలు
  • డిసెంబర్  27న ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహణకు సన్నాహకాలు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హార్రర్ కామెడీ మూవీ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దికుమార్ హీరోయిన్లుగా నటించారు.


సినిమా ట్రైలర్, పాటలు ఇప్పటికే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ డిసెంబర్ 27న హైదరాబాద్‌లో భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాకు సెన్సార్ పూర్తయింది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ ఇచ్చింది. మరోవైపు, ఈ సినిమా రన్ టైమ్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. మొత్తం రన్ టైం 183 నిమిషాలు (3 గంటల 3 నిమిషాలు)గా ఉంది. ఇన్ని గంటల పాటు ప్రేక్షకులను దర్శకుడు మారుతి థియేటర్ లో కూర్చోబెట్టగలరా అనేది ఆసక్తికరంగా మారింది. చాలా కాలం తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న వింటేజ్ స్టైల్ మూవీ కావడంతో, ఫ్యాన్స్ సినిమా కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. 



More Telugu News