Sameer Minhas: అండర్-19 ఆసియా కప్ ఫైనల్... టీమిండియా ముందు కొండంత టార్గెట్

Under 19 Asia Cup Final India faces huge target against Pakistan
షార్ట్స్‌లో చూడండి
దుబాయ్ వేదికగా జరుగుతున్న అండర్-19 ఫైనల్ పోరులో భారత్ ముందు పాకిస్థాన్ కొండంత లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్ లో భారత కుర్రాళ్ల జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అదే పెద్ద పొరపాటు అయింది. భారత బౌలర్లను చీల్చిచెండాడిన పాక్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 347 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. 

పాక్ ఓపెనర్ సమీర్ మిన్హాస్ 113 బంతుల్లో 172 పరుగులతో మాసివ్ ఇన్నింగ్స్ ఆడాడు. అతడి స్కోరులో 17 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. ఉస్మాన్ ఖాన్ 35, అహ్మద్ హుస్సేన్ 56 పరుగులు చేశారు. భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్ 3, హెనిల్ పటేల్ 2, ఖిలన్ పటేల్ 2, కనిష్క్ చౌహాన్ 1 వికెట్ తీశారు. 

అనంతరం, 348 పరుగుల టార్గెట్ ఛేదించేందుకు బరిలో దిగిన భారత్ 59 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో చకచకా 26 పరుగులు చేసినా, అలీ రజా బౌలింగ్ లో అవుటయ్యాడు. 

అంతకుముందే, కెప్టెన్ ఆయుష్ మాత్రే (3) తొలి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. వన్ డౌన్ లో వచ్చిన ఆరోన్ జార్జ్ 16, విహాన్ మల్హోత్రా 7 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ప్రస్తుతం భారత్ స్కోరు 7 ఓవర్లలో 4 వికెట్లకు 59 పరుగులు. భారత్ ఇంకా 43 ఓవర్లలో 289 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 6 వికెట్లు మాత్రమే ఉన్నాయి. 
Go Back to Shorts
Sameer Minhas
Under 19 Asia Cup Final
India vs Pakistan
U19 Asia Cup
Cricket
Pakistan U19
India U19
Dubai
Vaibhav Suryavanshi
Ayush Matre

More Telugu News