ఏపీలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసులకు ఏబీసీడీ అవార్డులు
- నేర పరిశోధనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు అవార్డులు
- ఏపీ పోలీసు ప్రధాన కార్యాలయంలో ‘ఏబీసీడీ’ పురస్కారాల కార్యక్రమం
- విజేతలను సత్కరించిన డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా
- మూడు త్రైమాసికాలకు గాను 13 కేసులను ఉత్తమమైనవిగా ఎంపిక
ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో నేర పరిశోధన విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు 2025 సంవత్సరానికి గాను ‘అవార్డ్ ఫర్ బెస్ట్ ఇన్ క్రైమ్ డిటెక్షన్’ (ఏబీసీడీ) పురస్కారాలను ప్రదానం చేశారు. పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా విజేతలకు అవార్డులతో పాటు నగదు బహుమతి, ప్రశంసాపత్రాలు అందజేశారు.
ఈ ఏడాది మూడు త్రైమాసికాలకు సంబంధించి నేర పరిశోధనలో ఉపయోగించిన సాంకేతిక పద్ధతులు, వినూత్న విధానాలపై సీఐడీ డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్ సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా మొదటి త్రైమాసికంలో 4, రెండో త్రైమాసికంలో 4, మూడో త్రైమాసికంలో 5 చొప్పున మొత్తం 13 కేసులను అత్యుత్తమమైనవిగా ఎంపిక చేశారు. ఈ కేసులను ఛేదించడంలో విశేష ప్రతిభ చూపిన అధికారులను ఏబీసీడీ అవార్డులకు ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా మాట్లాడుతూ.. పోలీసు సిబ్బంది తమ వృత్తి నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలని సూచించారు. నేర పరిశోధనలో ఉత్తమ పనితీరు కనబరిచిన వారిని గుర్తించి ప్రోత్సహించడం ద్వారా మిగతా సిబ్బందికి కూడా స్ఫూర్తినిచ్చినట్లు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.