ఐబొమ్మ రవికి 12 రోజుల కస్టడీ.. జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

  • నాలుగు కేసుల్లో విచారణకు అనుమతించిన నాంపల్లి కోర్టు
  • నేటి నుంచి సైబర్ క్రైమ్ పోలీసుల విచారణ ప్రారంభం
  • ఇప్పటికే రెండుసార్లు 8 రోజుల పాటు రవిని ప్రశ్నించిన పోలీసులు
పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి కీలక సమాచారం రాబట్టేందుకు నాంపల్లి కోర్టు రవికి 12 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతినిచ్చింది. ఈరోజు నుంచి పోలీసులు ఆయనను విచారించనున్నారు.

రవిపై నమోదైన మొత్తం ఐదు కేసుల్లో.. నాలుగు కేసులకు సంబంధించి ఒక్కో కేసుకు మూడు రోజుల చొప్పున మొత్తం 12 రోజుల పాటు విచారించేందుకు కోర్టు అనుమతినిచ్చింది. ఇప్పటికే ఈ కేసులో రవిని రెండుసార్లు మొత్తం 8 రోజుల పాటు పోలీసులు విచారించారు. అయితే, కేసు దర్యాప్తులో భాగంగా మరిన్ని కీలక వివరాలు రాబట్టాల్సి ఉందని భావించిన పోలీసులు, మరోసారి కస్టడీకి అనుమతించాలని కోర్టును ఆశ్రయించారు. ఈ తాజా విచారణలో ఐబొమ్మ నెట్‌వర్క్‌కు సంబంధించిన మరిన్ని ముఖ్యమైన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.


More Telugu News