యువ దర్శకుడు కేకే ఆకస్మిక మరణం
- టాలీవుడ్ దర్శకుడు కేకే అలియాస్ కిరణ్ కుమార్ ఆకస్మిక మృతి
- నాగార్జున ‘కేడి’ చిత్రానికి దర్శకత్వం వహించిన కేకే
- ప్రముఖ దర్శకుడు మణిరత్నం వద్ద అసోసియేట్ గా గుర్తింపు
- తాజాగా దర్శకత్వం వహించిన ‘కె.జె.క్యూ’ షూటింగ్ పూర్తి
అక్కినేని నాగార్జున హీరోగా ‘కేడి’ చిత్రాన్ని తెరకెక్కించిన కేకే అలియాస్ కిరణ్ కుమార్ హఠాన్మరణం చెందారు. ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న తాజా చిత్రం ‘కింగ్ జాకీ క్వీన్’ (కె.జె.క్యూ) షూటింగ్ పూర్తయిన కొన్ని రోజులకే ఈ విషాదం చోటుచేసుకోవడం చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతిని ‘కె.జె.క్యూ’ చిత్ర బృందం బుధవారం అధికారికంగా ప్రకటించింది.
‘కేడి’ సినిమా తర్వాత దర్శకత్వానికి సుదీర్ఘ విరామం తీసుకున్న కేకే, దిగ్గజ దర్శకుడు మణిరత్నం వద్ద సహాయకుడిగా కొనసాగారు. చాలా ఏళ్ల తర్వాత ఆయన మళ్లీ మెగాఫోన్ పట్టి శ్రీకాంత్ ఓదెల సోదరుడు శశి ఓదెల, దీక్షిత్ శెట్టి హీరోలుగా ‘కె.జె.క్యూ’ సినిమాను ప్రారంభించారు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ కూడా పూర్తయింది.
దర్శకుడిగానే కాకుండా కేకే నటుడిగానూ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇటీవల విడుదలైన విజయ్ ఆంటోనీ చిత్రం ‘భద్రకాళి’లో ఆయన సీబీఐ అధికారి పాత్రలో కనిపించి మెప్పించారు. నటుడిగా, దర్శకుడిగా మళ్లీ బిజీ అవుతున్న సమయంలో ఆయన ఆకస్మికంగా కన్నుమూయడం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆయన మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.