కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ
- ఒకప్పుడు పీసీఓలో రూ.500 జీతానికి ఉద్యోగం
- నెట్‌ఫ్లిక్స్ షోలో ఒక్కో ఎపిసోడ్‌కు రూ.5 కోట్ల పారితోషికం
- ముంబై, పంజాబ్‌లలో విలాసవంతమైన ఆస్తులు
- కెనడాలో సొంతంగా కేఫ్, ఖరీదైన కార్లు
ప్రముఖ కమెడియన్, నటుడు కపిల్ శర్మ ప్రస్తుతం రెండు కారణాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఒకటి, ఆయన నటించిన ‘కిస్ కిస్కో ప్యార్ కరూ 2’ సినిమా ఈ నెల 12న విడుదల కావడం. రెండోది, ప్రియాంక చోప్రాతో ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో’ కోసం స్పెషల్ ఎపిసోడ్ షూట్ చేయడం. ఈ ఎపిసోడ్ ఇప్పటికే సూపర్ హిట్ అయింది. అయితే, ఈ సందడి మధ్య కపిల్ శర్మ కేవలం నటుడు, కమెడియన్ మాత్రమే కాదని, ఆయన రూ.300 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన ఇండియాస్ బిగ్గెస్ట్ ఎంటర్‌టైనర్ అని చాలామందికి తెలియదు.
పీసీఓలో ఉద్యోగం నుంచి రూ.300 కోట్ల అధిపతిగా
హిందుస్థాన్ టైమ్స్ కథనం ప్రకారం.. కపిల్ శర్మ నికర ఆస్తుల విలువ సుమారు రూ.300 కోట్లు. పంజాబ్‌లో పుట్టిన కపిల్ ఈ స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టపడ్డారు. 1997లో తండ్రి క్యాన్సర్‌తో మరణించడంతో కుటుంబ భారం ఆయనపై పడింది. ఆ సమయంలో నెలకు రూ.500 జీతానికి పీసీఓలో, రూ.900కు టెక్స్‌టైల్ మిల్లులో కూడా పనిచేశారు. "పదో తరగతి తర్వాత పాకెట్ మనీ కోసం పీసీఓలో పనిచేశాను" అని ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు.
2007లో ‘ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్’ మూడో సీజన్ గెలవడం ఆయన జీవితాన్ని మార్చేసింది. బహుమతిగా వచ్చిన రూ.10 లక్షలతో సోదరి వివాహం జరిపించారు. ఆ తర్వాత ‘కామెడీ సర్కస్’లో ఆరు సీజన్లు గెలిచారు. 2013లో ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ షోతో దేశవ్యాప్తంగా అశేష ప్రేక్షకాదరణ పొందారు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో’ కోసం ఒక్కో ఎపిసోడ్‌కు రూ.5 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం.
కపిల్ శర్మకు ముంబైలో రూ.15 కోట్ల విలువైన ఇల్లు, పాటియాలాలో ఓ ఫామ్‌హౌస్ ఉన్నాయి. అంతేకాకుండా, కెనడాలో భార్యతో కలిసి ‘క్యాప్స్ కేఫ్’ను కూడా ప్రారంభించారు. ఇక ఆయన వద్ద రూ.5.5 కోట్ల విలువైన వ్యానిటీ వ్యాన్, రూ.1.19 కోట్ల విలువైన బెంజ్ కారు, రూ.1 కోటి విలువైన వోల్వో ఎక్స్‌సీ90 కారు ఉన్నాయని లైఫ్‌స్టైల్ ఏషియా కథనం పేర్కొంది. ఒక సాధారణ స్థాయి నుంచి అసాధారణ విజయాలు సాధించి, ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు కపిల్ శర్మ.