కర్ణాటకలో సీఎం మార్పు ఊహాగానాల వేళ ఆసక్తికర పరిణామం.. డీకేఎస్ డిన్నర్ మీట్
- 30 మంది ఎమ్మెల్యేలతో డిన్నర్ చేసిన ఉప ముఖ్యమంత్రి
- కాంగ్రెస్ నేత ప్రవీణ్ ఫామ్‌హౌస్ లో గురువారం రాత్రి సమావేశం
- పలువురు మంత్రులు కూడా పాల్గొన్నట్లు సమాచారం
కర్ణాటకలో సీఎం మార్పు ప్రచారం జరుగుతున్న వేళ గురువారం ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పలువురు ఎమ్మెల్యేలతో కలిసి డిన్నర్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు.. మొత్తం 30 మంది ఈ సమావేశంలో పాల్గొన్నట్లు సమాచారం. పార్టీ నేత ప్రవీణ్ కు చెందిన ఫామ్ హౌస్ లో జరిగిన ఈ విందు భేటీలో బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యేలు ఎస్‌టీ సోమశేఖర్, శివరామ్ హెబ్బర్ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. కాగా, అంతకుముందు రోజు సీఎం సిద్ధరామయ్య కూడా పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులతో డిన్నర్ చేయడం గమనార్హం. వారికి బెళగావి నార్త్ ఎమ్మెల్యే ఫిరోజ్ ఆతిథ్యం ఇచ్చారు.
ముఖ్యమంత్రి పదవి మార్పునకు సంబంధించి హైకమాండ్ సూచనల మేరకు ఇటీవల సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ లో భేటీ అయి చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో పార్టీ పనితీరు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చడంపై చర్చించుకున్నట్లు ఇరువురు నేతలు మీడియాకు వెల్లడించారు. ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్రంలో విందు రాజకీయాలు సంచలనంగా మారాయి. అయితే, ఇవన్నీ సాధారణ కార్యక్రమాలేనని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ‘‘ఎమ్మెల్యే ఇంట్లో జరిగిన విందులో పాల్గొన్నాం. అదొక స్నేహపూర్వక సమావేశం’’ అని డీకే చెప్పారు.