Justice Lisa Gill: ఏపీ హైకోర్టు జడ్జిగా జస్టిస్ లిసా గిల్ ప్రమాణస్వీకారం
- లిసా గిల్ తో ప్రమాణస్వీకారం చేయించిన చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్
- హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ లిసా
- న్యాయరంగంలో జస్టిస్ లిసాకు అపారమైన అనుభవం
ఆంధ్రప్రదేశ్ న్యాయరంగంలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలో జరిగిన ఈ వేడుకలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్ ఆమెతో ప్రమాణం చేయించారు. జస్టిస్ లిసా గిల్ నియామకం రాష్ట్ర న్యాయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలవబోతోంది.
ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ఈ ఏడాది ఏప్రిల్ 24వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఆయన తర్వాత జస్టిస్ లిసా గిల్ ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చరిత్రలోనే తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె సరికొత్త రికార్డు సృష్టించనున్నారు. న్యాయరంగంలో ఆమెకు ఉన్న అపారమైన అనుభవం, అందించిన సేవలను గుర్తించి ఉన్నత న్యాయస్థానం ఈ కీలక బాధ్యతలను ఆమెకు అప్పగించినట్లు తెలుస్తోంది.
ఈ నియామకం ద్వారా ఏపీ హైకోర్టులో మహిళా ప్రాతినిధ్యం పెరగడమే కాకుండా, రాబోయే రోజుల్లో న్యాయ వ్యవస్థలో మరిన్ని కీలక మార్పులు వచ్చే అవకాశం ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.