Allu Arjun: 'రేవంతన్న' అంటూ థ్యాంక్స్ చెప్పిన అల్లు అర్జున్
- కోకాపేటలో అల్లు సినిమాస్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి
- 'థ్యాంక్యూ వెరీమచ్ రేవంతన్న' అంటూ సంబోధించిన అల్లు అర్జున్
- తన తండ్రి తెలుగు సినిమా పరిశ్రమకు చాలా సేవ చేస్తున్నారన్న స్టైలిష్ స్టార్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్న 'రేవంతన్న' అని సంబోధించారు. ఈరోజు కోకాపేటలో మల్టీప్లెక్స్ 'అల్లు సినిమాస్'ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ, తమ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించినందుకు 'థ్యాంక్యూ వెరీమచ్ రేవంతన్న' అంటూ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సినిమా పరిశ్రమకు మద్దతుగా నిలుస్తోందని అన్నారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ తన తండ్రి అల్లు అరవింద్ తెలుగు సినిమా పరిశ్రమకు చాలా సేవ చేస్తున్నారని అన్నారు. అల్లు అరవింద్ తెలుగు సినిమాల బాక్సాఫీస్ స్థాయిని పెంచారని కొనియాడారు. అల్లు అరవింద్ తన తండ్రి మాత్రమే కాదని, ఆయన 'ఫాదర్ ఆఫ్ తెలుగు డిజిటల్ ఎరా' అని అన్నారు. తన తండ్రి గర్వపడేలా చేస్తామని అన్నారు.