మైనర్లు, మహిళలపై అకృత్యాలు జరిగింది ఇక్కడే.. ఎప్ స్టీన్ ఐలాండ్ లోపల ఎలా ఉందంటే..!
- విలాసతవంతమైన గదులు, కళ్లు చెదిరే సౌకర్యాలు
- సంపన్నుల వికృత క్రీడలకు అనువుగా ఏర్పాట్లు చేసుకున్న ఎప్ స్టిన్
- అమెరికాను కుదిపేసిన ఎప్ స్టీన్ ఫైల్స్ వ్యవహారం
అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్ స్టీన్ ఫైల్స్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సంపన్నుల వికృత క్రీడకు సజీవ సాక్ష్యంగా నిలిచిన పలు ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. జెఫ్రీ ఎప్ స్టీన్ తన ప్రైవేట్ ఐలాండ్ లో నిర్మించిన విలాసవంతమైన భవనాలు, వాటిలోని సౌకర్యాలకు సంబంధించిన ఫొటోలను హౌస్ కమిటీ విడుదల చేసింది.
విలాసవంతమైన బెడ్ రూంలు, బాత్ రూంలతో పాటు ఓ డెంటిస్ట్ గది కూడా ఈ ఫొటోలలో కనిపిస్తోంది. గదుల్లో ఖరీదైన రిసార్ట్ వాతావరణాన్ని చూడొచ్చు. భవనం ముందు స్విమ్మింగ్ పూల్, హెలిప్యాడ్ వీడియోలో కనిపిస్తోంది. ‘సీ వ్యూ’ను ఎంజాయ్ చేస్తూ సేదదీరేందుకు ఎప్ స్టీన్ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్ స్టీన్ చీకటి సామ్రాజ్యానికి సంబంధించిన ఈ ఫొటోలను విడుదల చేయడం వెనక విచారణలో పారదర్శకత ఉండాలన్నదే తమ ఉద్దేశమని కమిటీ పేర్కొంది. ఎప్ స్టీన్ బాధిత మహిళలకు న్యాయం జరిగేంత వరకూ తమ పోరాటం ఆగదని కమిటీ స్పష్టం చేసింది.