పాత్రధారులు అరెస్టయ్యారు.. ఇప్పుడు 'సూత్రధారి' వంతు
తెలంగాణ జిల్లాలను రణరంగంగా మార్చిన చలో అసెంబ్లీ కార్యక్రమ సమన్వయకర్త, తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం కూడా అరెస్టయ్యారు. ఇప్పటికే పలు పార్టీల ముఖ్య నేతలు అరెస్టు కాగా, తాజాగా కోదండరాంను అశోక్ నగర్ చౌరస్తా వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జేఏసీ కార్యకర్తలు పోలీసులపై రాళ్ళు రువ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.