న‌ల్ల‌చెరువులో ఆక్ర‌మ‌ణ‌ల‌ను మేం తొలగించలేదు... వారే వెళ్లిపోయారు: హైడ్రా

Telangana
Advertisement
  • కూకట్‌పల్లి నల్లచెరువు వివాదం.. కబ్జాదారుల పనేనన్న హైడ్రా
  • సర్వే నంబర్ 176లో ఖాళీ.. 180 పేరుతో కబ్జాకు యత్నం!
  • క్లారిటీ ఇచ్చిన హైడ్రా
కూకట్‌పల్లి నల్లచెరువు వద్ద బుధవారం తాము ఎలాంటి ఆక్రమణలను తొలగించలేదని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హైడ్రా) స్పష్టం చేసింది. చెరువు భూమిని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, పేదల గుడిసెలంటూ తప్పుడు ప్రచారం చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించింది.

హైడ్రా అధికారుల కథనం ప్రకారం... చెరువు పూర్తిస్థాయి నీటిమట్టం (ఎఫ్‌టీఎల్) పరిధిలోకి వచ్చే సర్వే నంబర్ 176లో చెత్త సేకరించేవారు, స్క్రాప్ వ్యాపారులు తాత్కాలిక షెడ్లు వేసుకున్నారు. చెరువు ప్రాంతాన్ని ఖాళీ చేయాలని వారిని కోరగా, రెండు మూడు రోజుల క్రితమే వారు స్వచ్ఛందంగా తమ షెడ్లను తొలగించుకుని వెళ్లిపోయారు. అయితే, ఈ స్థలాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్న కొందరు కబ్జాదారులు.. సర్వే నంబర్ 180 పేరుతో ఇప్పుడు కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చారు.

గతంలో ఇక్కడ ఉన్నవారి నుంచి అద్దెలు వసూలు చేసిన వారే, ఇప్పుడు వారిని అడ్డం పెట్టుకుని భూమిని కొట్టేయాలని చూస్తున్నారని హైడ్రా ఆరోపించింది. ఈ వ్యవహారంపై కొందరు హైకోర్టును కూడా ఆశ్రయించి, సర్వే నంబర్ 180 కింద తమకు నష్టపరిహారం కావాలని కోరారు. అయితే, తాము ఖాళీ చేయిస్తున్నది సర్వే నంబర్ 176 అని, చెరువులో చెత్త వేయడం వల్ల నీరు కలుషితమవుతోందని హైడ్రా కోర్టుకు వివరించింది.

దీనిపై స్పందించిన న్యాయస్థానం.. సర్వే నంబర్లను సరిచూసి, నోటీసులు ఇచ్చి ఖాళీ చేయించాలని సూచించినట్లు అధికారులు తెలిపారు. అసలైన నివాసితులు వెళ్లిపోయిన తర్వాత, కబ్జాదారులు చేస్తున్న చివరి ప్రయత్నమే ఈ గందరగోళమని హైడ్రా స్పష్టం చేసింది.
Advertisement

సంబంధిత వార్తలు

HYDRAHyderabad Metropolitan Development AuthorityNallacheruvu LakeKukatpallylake encroachmentTelanganaHMDAillegal occupationcourt ordersurvey number 176

More Telugu News

కాంగ్రెస్‌లో ముఠా తగాదాలు లేవు.. కొత్త ఏఐసీసీ ఇన్‌ఛార్జితో భేటీ తర్వాత మంత్రి పొంగులేటి

23 Nov, 13:51

ఏపీలో మూడో విడత పంచాయతీ పోరు.. భారీగా నామినేషన్లు

23 Nov, 13:46

రావణ తాండవం కోసం 13 ట్యూన్లు మార్చారా? 'రామాయణ'పై ఏఆర్ రెహమాన్ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌!

23 Nov, 13:41

విజయవాడ మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన వంగవీటి రాధాకృష్ణ

23 Nov, 13:33

సిరాజ్ ఉంటే గెలిచేవాళ్లమా? న్యూజిలాండ్ టెస్ట్ డ్రా వేళ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు

23 Nov, 13:30

ఐఏఎస్‌ జయేశ్‌ రంజన్‌ వీఆర్‌ఎస్‌.. సొంత కన్సల్టెన్సీ వైపు అడుగులు?

23 Nov, 13:24

హిమాలయాల్లో పీతలా పక్కకు నడిచిన కారు.. నెట్టింట వైరల్ అవుతున్న హమ్మర్ ఈవీ మాయాజాలం!

23 Nov, 13:20

పాకిస్థాన్‌లో తీవ్ర గ్యాస్ సంక్షోభం.. వంట చేసుకోలేక ప్రజల అవస్థలు

23 Nov, 13:08

భర్త వీర్ సాహు నుంచి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించిన సప్నా చౌదరి

23 Nov, 13:04

ప్రభుదేవా డైరెక్షన్‌లో మంచు విష్ణు సినిమా.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ విశేషాలివే!

23 Nov, 12:45

ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీ నేత ఇంట్లో భారీగా మద్యం నిల్వలు.. 1341 బాటిళ్లు స్వాధీనం

23 Nov, 12:44

వాటర్ బాటిల్ కొంటున్నారా? బిస్లరీ వివాదం వేళ రంగంలోకి ఎఫ్ఎస్ఎస్ఏఐ.. అన్ని బ్రాండ్ల శాంపిల్స్ టెస్టింగ్!

23 Nov, 12:42

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. గంటల వ్యవధిలో రూ.3 లక్షల కోట్లు ఆవిరి!

23 Nov, 12:30

కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలి: కోమటిరెడ్డి

23 Nov, 12:28

ఆమె వల్లే చాలా నేర్చుకున్నా: శోభితతో సీక్రెట్ లవ్, పెళ్లి విశేషాలు పంచుకున్న నాగచైతన్య!

23 Nov, 12:27
..More Telugu News