పెంపుడు కుక్క దాడిలో తెగిపడిన బాలుడి చెవి.. వీడియో ఇదిగో!
- ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై పిట్ బుల్ దాడి
- బాలుడి చెవిని కొరికిన శునకం.. శరీరంపైనా పలుచోట్ల గాయాలు
- బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో శునకం యజమాని అరెస్టు
బాలుడిపైకి కుక్క ఎగబడడం, పరిగెత్తుతున్న బాలుడిని కిందపడేయడం వీడియోలో కనిపిస్తోంది. బాలుడిపై దాడి చేసిన శునకం పిట్ బుల్ బ్రీడ్ కు చెందినది. వాస్తవానికి ఈ జాతి శునకాల పెంపకంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అయినప్పటికీ చాలామంది వీటిని పెంచుకుంటున్నారు. తాజా దాడిపై బాధిత బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. శునకం యజమానిని అరెస్టు చేశారు. శునకం దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడు ప్రస్తుతం రోహిణిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.