ఓటీటీలో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్!
- తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ గా 'స్టీఫెన్'
- డిసెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్
- ఐదు భాషల్లో అందుబాటులోకి
- అమ్మాయిల హత్యల చుట్టూ తిరిగే కథ
ఇప్పుడు ఓటీటీకి రానున్న సైకాలాజికల్ థ్రిల్లర్ 'స్టీఫెన్' కూడా ఇదే రూట్లో ముందుకు వెళుతుంది. 9 మంది అమ్మాయిల హత్యల చుట్టూ ఈ కథ నడుస్తుంది. అయితే రొటీన్ కి భిన్నమైన ఒక పాయింట్ ను ఈ సినిమాలో టచ్ చేయనున్నట్టు దర్శకుడు మిథున్ బాలాజీ చెబుతున్నారు. హత్యలు చేయడానికి హంతకుడు పన్నే వ్యూహాలు .. తప్పించుకునే మార్గాలు .. ఇన్వెస్టిగేషన్ కొనసాగే తీరు .. ప్రేక్షకులలో ఉత్కంఠను రేకెత్తిస్తుందని అంటున్నారు.
గోమతి శంకర్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, స్మృతి వెంకట్ కీలకమైన పాత్రలో నటించారు. డిసెంబర్ 5వ తేదీ నుంచి ఈ సినిమాను 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ చేయనున్నారు. తమిళంతో పాటు తెలుగు .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. థ్రిల్లర్ జోనర్ పట్ల ఆసక్తిని కనబరిచేవారిని ఈ సినిమా ఎంతవరకూ ఆకట్టుకుంటుందనేది చూడాలి.