పసిడి ప్రియులకు శుభవార్త.. వేలల్లో తగ్గిన బంగారం, వెండి ధరలు
- భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు
- 10 గ్రాముల బంగారంపై రూ.3,900 క్షీణత
- కిలో వెండి ఏకంగా రూ.7,800 పతనం
వచ్చే నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు బలహీనపడటమే ఈ పతనానికి ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర 4,042 డాలర్లకు పడిపోగా, ఔన్స్ వెండి ధర 50 డాలర్లకు తగ్గింది. అంతర్జాతీయ రేట్ల ప్రభావంతోనే దేశీయ మార్కెట్లోనూ ధరలు తగ్గినట్లు నిపుణులు తెలిపారు.