కొండా సురేఖపై కేసు ఉపసంహరించుకున్న నాగార్జున

  • మంత్రిపై పరువు నష్టం కేసును ఉపసంహరించుకున్నట్లు నాగార్జున వెల్లడి
  • గతంలో నాగార్జున కుటుంబంపై కొండా సురేఖ వ్యాఖ్యలు
  • నిన్న క్షమాపణలు చెబుతూ 'ఎక్స్' వేదికగా ట్వీట్
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై టాలీవుడ్ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున క్రిమినల్ కేసును ఉపసంహరించుకున్నారు. మంత్రి తనకు, తన కుటుంబానికి క్షమాపణలు చెప్పినందున, ఆమెపై దాఖలు చేసిన పరువునష్టం దావాను ఉపసంహరించుకుంటున్నట్లు నాగార్జున తెలిపారు.

గతంలో నాగార్జున కుటుంబంపై తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని మంత్రి కొండా సురేఖ నిన్న సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా వెల్లడించారు. నాగార్జునను, ఆయన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని కానీ, వారి పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించాలని కానీ తన ఉద్దేశం కాదని ఆమె పేర్కొన్నారు. నాగార్జున కుటుంబంపై తాను చేసిన వ్యాఖ్యల్లో ఏదైనా పొరపాటు జరిగి ఉంటే అందుకు చింతిస్తున్నానని, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని ఆమె తెలిపారు.


More Telugu News