KTR: రాహుల్ బంధు కింద రేవంత్ రెడ్డి రూ.1000 కోట్లు పంపిస్తున్నారు: కేటీఆర్ ఎద్దేవా

KTR Slams Revanth Reddy Over Rahul Bandhu Scheme
  • కేసీఆర్ హయాంలో డిసెంబర్ నెలలో రైతుబంధు పడేదన్న కేటీఆర్
  • ఇప్పుడు కోతల సమయం వచ్చినా రైతుబంధు పడలేదన్న కేటీఆర్
  • రుణమాఫీ చేశానని అనుకుంటున్నానని రేవంత్ రెడ్డి చెప్పడం విడ్డూరమని వ్యాఖ్య
'రాహుల్ బంధు' పథకం కింద ప్రతి సంవత్సరం రూ.1000 కోట్లు ఇచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవిని కాపాడుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సిరిసిల్లలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ హయాంలో డిసెంబర్ నెలలో రైతుబంధు పడేదని, కానీ ఇప్పుడు కోతల సమయం వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం వేయలేదని విమర్శించారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనలో రైతుబంధును నిలిపివేసి 'రాహుల్ బంధు' పేరుతో కొత్త పథకం తెచ్చారని ఎద్దేవా చేశారు. తన పదవిని కాపాడుకోవడం కోసం రేవంత్ రాహుల్ బంధు పథకం కింద గాంధీ కుటుంబానికి వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తున్నాడని ఆరోపించారు. అందుకే కేసీఆర్ ముందే చెప్పారని, ఆలోచించి జాగ్రత్తగా ఓటు వేయాలని సూచించారని తెలిపారు. రేవంత్ రెడ్డి మూడుసార్లు రైతుబంధును ఎగ్గొట్టారని విమర్శించారు.

"నేను రుణమాఫీ చేశానని అనుకుంటున్నా, రైతుబంధు వేశానని అనుకుంటున్నా" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అన్నారని, అసలు ఆయన ముఖ్యమంత్రేనా అని నిలదీశారు. మరి ముఖ్యమంత్రిగా మీరెందుకు ఉన్నారని ప్రశ్నించారు. రైతుబంధు వేస్తే, రుణమాఫీ ఇస్తే మీకు తెలియకుండా ఉండటమేమిటని అన్నారు. హైదరాబాద్‌లో దోమలు బాగా పెరిగిపోయాయని, కానీ నగరంలో చెత్తను మాత్రం తీయడం లేదని విమర్శించారు.
KTR
KT Rama Rao
Revanth Reddy
Rahul Gandhi
Rythu Bandhu
Telangana
BRS
Congress
Farmer scheme

More Telugu News