Rashmika: నా గురించి రాసిన ఆర్టికల్ చదివి ఎమోషనల్ అయ్యా.. ఎంతో చెప్పాలని ఉన్నా మాటలు రావడం లేదు: రష్మిక

Rashmika emotional after reading article about her
  • రష్మిక, విజయ్ దేవరకొండల సినిమాలు, ప్రేమాయణం, వివాహం గురించి రాసిన నెటిజన్
  • చాలా రోజుల తర్వాత నా గురించి ఆర్టికల్ చదివానన్న రష్మిక
  • మిమ్మల్ని స్వేచ్ఛగా ఉండనిచ్చే ప్రేమను వెతుక్కోవాలని సూచన
చాలారోజుల తర్వాత తన గురించి రాసిన ఒక ఆర్టికల్‌ను చదివి ఎంతో ఎమోషనల్ అయ్యానని, ఎంతో చెప్పాలని ఉంది కానీ మాటలు రావడం లేదని ప్రముఖ సినీ నటి రష్మిక అన్నారు. గత నెలలో విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం జరిగిన విషయం తెలిసిందే. రష్మిక, విజయ్‌ల సినిమాలు, వారి ప్రేమాయణం, వివాహం గురించి ఒక నెటిజన్ తన బ్లాగ్‌లో రాశారు. దీనిని చదివిన రష్మిక, తాను భావోద్వేగానికి గురైనట్లు చెప్పారు.

చాలా రోజుల తర్వాత తన గురించి రాసిన ఆర్టికల్ చదివానని పేర్కొన్నారు. ప్రస్తుతం తనకంటూ ప్రత్యేక స్థానాన్ని వెతుక్కునే ప్రయాణంలో ఆనందంగా ఉన్నానని రష్మిక పేర్కొన్నారు. దానిని గుర్తించి ఇంత అందంగా వివరించినందుకు సదరు నెటిజన్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ప్రేమ గురించి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నానని, మిమ్మల్ని స్వేచ్ఛగా ఉండనిచ్చే ప్రేమను వెతుక్కోవాలని అన్నారు.
Rashmika
Rashmika Mandanna
Vijay Devarakonda
Rashmika Vijay marriage
Telugu cinema
Love article

More Telugu News