నితీశ్ రెడ్డి దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడడం లేదు... ఎందుకంటే...!

  • ఇండియా-ఎ వన్డే సిరీస్‌లో పాల్గొననున్న తెలుగు ఆల్‌రౌండర్
  • రాజ్‌కోట్‌లో దక్షిణాఫ్రికా-ఎ జట్టుతో మూడు వన్డేల సిరీస్
  • రెండో టెస్టు నాటికి తిరిగి భారత జట్టుతో కలవనున్న నితీశ్
  • తొలి టెస్టుకు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్  
  • ఇండియా-ఎ జట్టుకు తిలక్ వర్మ సారథ్యం
దక్షిణాఫ్రికాతో జరగనున్న టెస్ట్ సిరీస్‌కు ముందు భారత జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. తెలుగు ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని తొలి టెస్టుకు దూరంగా ఉంచాలని జట్టు యాజమాన్యం నిర్ణయించింది. నవంబర్ 14 నుంచి కోల్‌కతా వేదికగా ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌కు ఆయన అందుబాటులో ఉండరు.
 
మరింత మ్యాచ్ ప్రాక్టీస్ కల్పించే ఉద్దేశంతో నితీశ్‌ను ఇండియా-ఎ జట్టుకు పంపించారు. రాజ్‌కోట్‌లో దక్షిణాఫ్రికా-ఎ జట్టుతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో ఆయన పాల్గొంటారు. నవంబర్ 13 నుంచి 19 వరకు ఈ సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ ముగిసిన తర్వాత నితీశ్ కుమార్ రెడ్డి తిరిగి భారత జట్టుతో కలుస్తాడు. నవంబర్ 22న గువాహటిలో ప్రారంభమయ్యే రెండో టెస్టుకు ఆయన అందుబాటులోకి వస్తాడు.
 
దక్షిణాఫ్రికాతో తొలి టెస్టుకు భారత జట్టు:

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్‌కీపర్, వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, కుల్‌దీప్ యాదవ్, ఆకాశ్‌ దీప్.
 
దక్షిణాఫ్రికా-ఎతో వన్డే సిరీస్‌కు ఇండియా-ఎ జట్టు:

తిలక్ వర్మ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్‌ కెప్టెన్), అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్), ఆయుష్ బదోని, నిషాంత్ సింధు, విప్రజ్ నిగమ్, మానవ్ సుతార్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్‌ కృష్ణ, ఖలీల్ అహ్మద్‌, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (వికెట్‌కీపర్), నితీశ్‌ కుమార్ రెడ్డి.


More Telugu News