ఐఏఎస్ అయిన నా భార్త వేధిస్తున్నాడు.. కిడ్నాప్ కూడా చేశాడు: ఐఏఎస్ అధికారిణి ఫిర్యాదు
- భర్త ఆశిష్‌పై జైపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య భారతి దీక్షిత్
- 2014లో వివాహమైనప్పటి నుంచి వేధిస్తున్నాడని ఆరోపణ
- తరుచూ మద్యం సేవించి వచ్చి శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడని ఫిర్యాదు
రాజస్థాన్‌లో ఒక ఐఏఎస్ అధికారిణి తన భర్త వేధింపులకు గురి చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. జైపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాజస్థాన్ ప్రభుత్వ ఆర్థిక శాఖలో జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారిణి భారతి దీక్షిత్, తన భర్త ఆశిష్ గృహహింసకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు.
ఆమె భర్త ఆశిష్ కూడా ఐఏఎస్ అధికారే. అతడు సామాజిక న్యాయం, సాధికారత విభాగంలో డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆశిష్‌తో వివాహం జరిగినప్పటి నుంచి తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని, ఈ మధ్య వేధింపులు ఎక్కువయ్యాయని భారతీ దీక్షిత్ ఆరోపించారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తామిద్దరం 2014 బ్యాచ్‌కు చెందిన రాజస్థాన్ కేడర్ ఐఏఎస్ అధికారులమని, తమ వివాహం కూడా అప్పుడే జరిగిందని ఆమె తెలిపారు.
2014లో వివాహం జరిగినప్పటి నుంచి అతడు తరుచుగా మద్యం సేవించి వచ్చి శారీరకంగా, మానసికంగా వేధిస్తుండేవాడని ఆమె ఆరోపించారు. అతడికి పలువురు నేరస్థులతో సంబంధాలు ఉన్నాయని కూడా ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గత నెలలో ఆశిష్ తన స్నేహితులతో కలిసి తనను అపహరించి చాలా గంటల పాటు నిర్బంధించారని, విడాకులకు అంగీకరించకపోతే తనను, తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.