కళ్ల ముందే కుప్పకూలిన హెలికాప్టర్.. వీడియో ఇదిగో!
- రష్యాలో నలుగురు దుర్మరణం.. ముగ్గురికి గాయాలు
- మృతుల్లో యుద్ధ విమానాల విడిభాగాల తయారీ కంపెనీ సిబ్బంది
- గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందన్న వైద్యులు
జిన్హువా వార్తా సంస్థ కథనం ప్రకారం..దక్షిణ రష్యాలోని డాగేస్తాన్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని రష్యా మంత్రి యారోస్లావ్ గ్లాజోవ్ తెలిపారు. ఈ హెలికాప్టర్లో రష్యాలోని కిజ్ల్యార్ ఎలక్ట్రోమెకానికల్ ప్లాంట్‌కు చెందిన సీనియర్ సిబ్బంది ఉన్నారని ఆయన వెల్లడించారు. కాగా, సుఖోయ్ మరియు మిగ్ అటాక్ ఎయిర్‌క్రాఫ్ట్ లకు అవసరమైన గ్రౌండ్ కంట్రోల్ మరియు డయాగ్నస్టిక్ సిస్టమ్స్ ను కిజ్ల్యార్ ఎలక్ట్రోమెకానికల్ ప్లాంట్ తయారుచేస్తుంది.