రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన జూనియర్ ఎన్టీఆర్

  • నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిన రోజు
  • దేవుడు మీకు ఆయురారోగ్యాలు, సంతోషం ఇవ్వాలని ఎక్స్ వేదికగా పేర్కొన్న ఎన్టీఆర్
  • శుభాకాంక్షలు తెలియజేసిన పలువురు ప్రముఖులు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. "తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ దేవుడు మీకు ఆయురారోగ్యాలు, సంతోషం ఇవ్వాలని కోరుకుంటున్నాను" అని సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్' ద్వారా పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, కొండా సురేఖ, మహమ్మద్ అజారుద్దీన్, బీజేపీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్, డాక్టర్ లక్ష్మణ్, ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, డీఎంకే నాయకురాలు కనిమొళి తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.


More Telugu News