రూ.35,000 లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన జీహెచ్ఎంసీ అధికారి

GHMC Officer Caught Red Handed Taking Bribe of Rs 35000
  • సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో పట్టుకున్న ఏసీబీ
  • అకౌంట్స్ విభాగంలో ఎగ్జామినర్‌గా పనిచేస్తున్న సంతోష్
  • పెన్షన్ ప్రాసెస్ చేయడానికి రూ.40 వేలు లంచం డిమాండ్ చేసిన సంతోష్
జీహెచ్ఎంసీ అధికారి ఒకరు ఏసీబీకి చిక్కారు. సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలోని అకౌంట్స్ విభాగంలో ఎగ్జామినర్‌గా పనిచేస్తున్న సూర్యవంశీ సంతోష్ రూ.35 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగి పెన్షన్ ప్రాసెస్ చేయడానికి గాను సంతోష్ రూ.40 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ క్రమంలో కార్యాలయంలో రూ.35,000 తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 

ఈ సందర్భంగా ఏసీబీ ప్రజలకు సూచన జారీ చేసింది. ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడైనా లంచం అడిగినట్లయితే అవినీతి నిరోధక శాఖ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు ఫోన్ చేసి సమాచారం అందించవచ్చని తెలిపింది. అంతేకాకుండా వివిధ సామాజిక మాధ్యమాలు వాట్సాప్ (9440446106), ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (TelanganaACB), వెబ్ సైట్ (http://acb.telangana.gov.in ) ద్వారా కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులకు సమాచారం అందించవచ్చని సూచించింది. ఫిర్యాదుధారుల లేదా బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతామని పేర్కొంది.
Go Back to Shorts
GHMC Officer
GHMC
ACB
Bribery
Telangana ACB
Corruption
Suryavanshi Santosh
Secunderabad

More Telugu News