వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మలతో ఎక్కువ ప్రమాదం: ప్రత్యర్థి జట్లకు రవిచంద్రన్ అశ్విన్ సూచన
- బూమ్రా కంటే వారిద్దరే ప్రమాదమన్న రవిచంద్రన్ అశ్విన్
- ఏ జట్టైనా గెలవాలంటే వరుణ్, శర్మలే ప్రధాన అడ్డంకి అన్న అశ్విన్
- టిమ్ డేవిడ్.. వరుణ్ చక్రవర్తిని ఎదుర్కొన్న విధానం చూశాక తన అభిప్రాయానికి బలం చేకూరిందన్న అశ్విన్
ప్రస్తుత సిరీస్‌లో టిమ్ డేవిడ్... బౌలర్ వరుణ్ చక్రవర్తిని ఎదుర్కొన్న విధానం చూసిన తర్వాత తన అభిప్రాయానికి మరింత బలం చేకూరిందని అన్నాడు. వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మలను ఎదుర్కోగలిగితే ప్రత్యర్థి జట్లు విజయం సాధించగలవని అంచనా వేశాడు. ప్రస్తుత సిరీస్‌లో ఆస్ట్రేలియా అభిషేక్‌పై షార్ట్ బాల్ వ్యూహం అనుసరిస్తోందని, ప్రపంచ కప్‌లోనూ ఇలాంటి ప్రణాళికతోనే వెళతారని అభిప్రాయపడ్డాడు. వరుణ్ చక్రవర్తి విషయంలోనూ ఇలాంటి వ్యూహాలతో సిద్ధమవుతారని పేర్కొన్నాడు.