ఏసీఏ కీలక నిర్ణయం.. విశాఖ స్టేడియంలోని ఒక వింగ్‌కు శ్రీ చరణి పేరు
- ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్ని కీలక ప్రకటన
- శ్రీ చరణికి రూ. 2.5 కోట్ల నగదు, గ్రూప్ 1 ఉద్యోగం
- కడపలో ఇంటి స్థలం కేటాయింపుపై సీఎం హామీ
- త్వరలో మహిళా క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేస్తామన్న ఏసీఏ
- ఉండవల్లిలో సీఎం చంద్రబాబుతో శ్రీ చరణి భేటీ
అంతకుముందు, శ్రీ చరణి ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా ఆమె ప్రతిభను అభినందించిన సీఎం, రాష్ట్ర ప్రభుత్వం తరపున భారీ ప్రోత్సాహకాలను ప్రకటించారు. శ్రీ చరణికి గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం, రూ. 2.5 కోట్ల నగదు బహుమతి, కడపలో నివాస స్థలం అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఆ తర్వాత మంగళగిరిలో కేశినేని చిన్ని మాట్లాడుతూ, ఏసీఏ తరపున రాష్ట్రంలోని క్రీడాకారులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. శ్రీ చరణికి లభించిన ఈ గౌరవం భవిష్యత్ తరాల క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో, రాష్ట్రంలో మహిళా క్రికెట్‌ను ప్రోత్సహించే లక్ష్యంతో త్వరలోనే ఒక మహిళా క్రికెట్ అకాడమీని ప్రారంభిస్తామని ఆయన ప్రకటించారు.