రేపు ఓటీటీకి వచ్చేస్తున్న 'మిత్రమండలి'!
- రీసెంటుగా థియేటర్లకు 'మిత్రమండలి'
- రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో
- విలేజ్ నేపథ్యంలో నడిచే కథ
- కామెడీ ప్రధానంగా సాగే కంటెంట్
ఈ మధ్య కాలంలో ఇలా థియేటర్ కి వచ్చిన సినిమాలు, నెల తిరక్కుండానే అలా ఓటీటీకి వచ్చేస్తున్నాయి. అలాంటి సినిమాల జాబితాలో 'మిత్రమండలి' కూడా చేరిపోయిందనే చెప్పాలి. ఈ సినిమాలో ప్రియదర్శి .. విష్ణు .. ప్రసాద్ బెహరా .. రాగ్ మయూర్ .. నిహారిక .. ప్రధానమైన పాత్రలను పోషించారు. విజయేందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది.
అక్టోబర్ 16వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేశారు. కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా,ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ఈ నెల 6వ తేదీ నుంచి ఈ సినిమాను 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. వీటీవీ గణేశ్ .. వెన్నెల కిశోర్ .. సత్య ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఓ మాదిరి మార్కులను మాత్రమే సంపాదించుకోగలిగింది.
'మిత్రమండలి' సినిమా కథ విషయానికి వస్తే, అది ఒక విలేజ్ .. అక్కడ నలుగురు కుర్రాళ్లు కూడా నివసిస్తూ ఉంటారు. ఆ నలుగురూ మంచి స్నేహితులు. ఆ ఊళ్లో వాళ్లతో పాటు ఈ నలుగురు కుర్రాళ్లు కూడా ఒక వ్యక్తికి భయపడుతుంటారు .. అతనిని అందరూ 'పులిబిడ్డ'గా పిలుచుకుంటూ ఉంటారు. అతని కూతురే స్వేచ్ఛ. ఆమె పట్ల కుర్రాళ్లు నలుగురూ ఆకర్షితులవుతారు. అదే సమయంలో ఆమె కిడ్నాప్ జరుగుతుంది. అందుకు కారకులు ఎవరు? ఆ తరువాత ఏం జరుగుతుంది? అనేది కథ.