శివ 'డాల్బీ అట్మాస్ సౌండ్ తో స్టన్నింగ్ గా అనిపించింది: నాగార్జున
- నాగార్జున కల్ట్ క్లాసిక్ 'శివ' 4K రీరిలీజ్
- అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్ల వేడుకల్లో భాగంగా విడుదల
- డాల్బీ అట్మాస్ సౌండ్‌తో సరికొత్త అనుభూతి అందిస్తున్న చిత్రం
- నవంబర్ 14న థియేటర్లలోకి రానున్న 'శివ'
- సౌండ్ డిజైన్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పిన నాగార్జున
కింగ్ నాగార్జున కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోయిన కల్ట్ క్లాసిక్ 'శివ' సరికొత్త టెక్నాలజీతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భారతీయ సినిమాను 'బిఫోర్ శివ', 'ఆఫ్టర్ శివ'గా మార్చిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 4K డాల్బీ అట్మాస్ టెక్నాలజీతో నవంబర్ 14న గ్రాండ్‌గా రీరిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అభిమానుల సమక్షంలో రీరిలీజ్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి నాగార్జున, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హాజరయ్యారు.
అద్భుతమైన 4K విజువల్స్, డాల్బీ అట్మాస్ సౌండ్‌తో విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ప్రతి సన్నివేశంలోనూ టెన్షన్, ఎమోషన్‌ను కొత్త సౌండ్ డిజైన్ మరింతగా పెంచింది. ముఖ్యంగా ట్రైలర్ చివర్లో నాగార్జున సైకిల్ చైన్ లాగే ఐకానిక్ సీన్ గూస్‌బంప్స్ తెప్పించింది. ఈ ట్రైలర్‌తో 'శివ' మ్యాజిక్‌ను థియేటర్లలో కొత్తగా అనుభూతి చెందాలనే ఆసక్తి ప్రేక్షకులలో రెట్టింపయింది.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, "36 ఏళ్ల క్రితం నన్ను పెద్ద స్టార్‌ను చేసిన చిత్రం 'శివ'. పొద్దున్నే రీమాస్టర్ చేసిన సినిమా చూశాను. సౌండ్ డిజైన్ స్టన్నింగ్‌గా అనిపించింది. రాము (రామ్ గోపాల్ వర్మ) దాదాపు 6 నెలలు కష్టపడి ప్రతి సౌండ్ ట్రాక్‌ను ఎంతో ఇష్టంగా డిజైన్ చేశాడు. డాల్బీ అట్మాస్‌లో 'శివ' థియేటర్లలో మైండ్ బ్లోయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. నవంబర్ 14న మీరందరూ ఈ సినిమాను కొత్తగా చూడబోతున్నారు. మరో 36 ఏళ్ల తర్వాత కూడా ఈ సినిమాను మళ్లీ తీసుకురావాలని కోరుకుంటున్నాను" అని తెలిపారు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ..చిరంజీవి చెప్పినట్టు సినిమా ఉన్నంతకాలం 'శివ' కూడా చిరంజీవిలా చిరస్మరణీయంగా నిలిచిపోతుందన్నారు. 1989లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై అక్కినేని వెంకట్, వై. సురేంద్ర నిర్మించారు.