మెట్రో రైలు నుంచి వృద్ధుడిని తోసేసిన యువకుల అరెస్టు
- గత నెల 21వ తేదీన ఘటన
- సీనియర్ సిటిజన్ సీటులో కూర్చున్న యువకులను ఖాళీ చేయమని కోరిన వృద్ధుడు
- ఆగ్రహంతో లక్డీకాపూల్ స్టేషన్ రాగానే బయటకు తోసేసిన యువకులు
లక్డీకాపూల్ మెట్రో స్టేషన్ రాగానే వారు ఆ వృద్ధుడిని రైలు నుంచి తోసివేశారు. గాయపడిన బాధితుడు ఈ ఘటనపై సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, నిజాంపేటకు చెందిన సివ్వాల సునీల్, అశోక్‌లతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురంకు చెందిన రాజేశ్‌లను అరెస్టు చేశారు.