తిరువూరు రగడపై సీఎం చంద్రబాబు స్పందన
- కొలికపూడి, కేశినేని చిన్ని వివాదంపై చంద్రబాబు తీవ్ర అసహనం
- విభేదాల వ్యవహారాన్ని పార్టీ క్రమశిక్షణ కమిటీకి అప్పగింత
- క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
విదేశీ పర్యటనకు వెళ్లే ముందు పార్టీ నేతలతో భేటీ అయిన చంద్రబాబు, పలు అంశాలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. కొలికపూడి, కేశినేని చిన్ని ఇద్దరినీ పిలిచి మాట్లాడాలని, వారి నుంచి పూర్తి వివరణ తీసుకుని తనకు నివేదిక సమర్పించాలని క్రమశిక్షణ కమిటీకి సూచించారు. తాను విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక స్వయంగా ఇద్దరితోనూ మాట్లాడతానని, ఆలోగా వివాదం సద్దుమణగకపోతే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసినట్లు సమాచారం.