ఇది మాటలకు అందని విషాదం: మోహన్ బాబు
- కర్నూలు బస్సు ప్రమాదంపై సినీ ప్రముఖుల తీవ్ర దిగ్భ్రాంతి
- మోహన్ బాబు, ఖుష్బూ, విష్ణు ఆవేదన
- ప్రమాదం కలచివేసిందన్న విష్ణు
ఈ ప్రమాదంపై మోహన్‌బాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘హైదరాబాద్-బెంగళూరు హైవేపై జరిగిన బస్సు దుర్ఘటన గురించి విని చాలా బాధపడ్డాను. క్షణాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇది మాటలకందని విషాదం. కుటుంబసభ్యులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’’ అని ఆయన పేర్కొన్నారు.
నటి ఖుష్బూ స్పందిస్తూ, ‘‘కర్నూలులో జరిగిన విషాదకరమైన బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి. ఈ దారుణమైన క్షణాలను తట్టుకునే శక్తినివ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు. నటుడు విష్ణు కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, ‘‘బస్సు ప్రమాద ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం’’ అని అన్నారు.