పుతిన్‌తో చర్చలు బాగుంటాయి... కానీ, ఫలితం మాత్రం ఉండదు: డొనాల్డ్ ట్రంప్ అసహనం
- రష్యాకు చెందిన రెండు అతిపెద్ద ఆయిల్ కంపెనీలపై అమెరికా కొత్త ఆంక్షలు
- శాంతి చర్చల్లో పురోగతి లేకపోవడమే ప్రధాన కారణం
- రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జరగాల్సిన భేటీని రద్దు చేసుకున్న ట్రంప్
ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు శాంతి చర్చల విషయంలో ముందుకురాని రష్యాపై అమెరికా తన వైఖరిని కఠినతరం చేసింది. రష్యా ఆర్థిక వ్యవస్థకు జీవనాధారమైన రెండు అతిపెద్ద చమురు కంపెనీలపై కొత్త ఆంక్షలను విధిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఒత్తిడి పెంచి, ఆయన్ను చర్చల వేదికపైకి తీసుకురావడమే ఈ చర్యల ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేసింది.
ఈ ప్రకటన వెలువడటానికి ఒక రోజు ముందే, పుతిన్‌తో బుడాపెస్ట్‌లో జరగాల్సిన సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. "పుతిన్‌తో మాట్లాడిన ప్రతిసారీ చర్చలు బాగానే సాగుతాయి, కానీ అవి ఎక్కడికీ దారితీయడం లేదు" అని ట్రంప్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటివరకు సంయమనం పాటిస్తూ వచ్చిన ట్రంప్ సర్కార్, ఒక్కసారిగా ఈ కఠిన నిర్ణయం తీసుకోవడం ఆయన విదేశాంగ విధానంలో వచ్చిన పెద్ద మార్పుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ మాట్లాడుతూ, "ఈ అర్థంలేని యుద్ధాన్ని ముగించడానికి పుతిన్ నిరాకరిస్తున్నందువల్లే ఈ ఆంక్షలు అవసరమయ్యాయి" అని తెలిపారు. రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్, లుకాయిల్ అనే ఈ రెండు కంపెనీలు రష్యా యుద్ధ యంత్రాంగానికి నిధులు సమకూరుస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ రెండు కంపెనీలు రోజుకు 3.1 మిలియన్ బ్యారెళ్ల చమురును ఎగుమతి చేస్తాయి.
అమెరికా తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ స్వాగతించారు. ఇది అమెరికా నుంచి వచ్చిన మంచి సంకేతం అని, ఇతర దేశాలు కూడా ఇలాగే ఒత్తిడి పెంచితే కాల్పుల విరమణ సాధ్యమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గతవారమే బ్రిటన్ కూడా ఇదే తరహా ఆంక్షలను ప్రకటించగా, యూరోపియన్ యూనియన్ సైతం రష్యా నుంచి దిగుమతయ్యే సహజ వాయువుపై నిషేధం విధించింది. ఈ పరిణామాలపై స్పందించిన రష్యా, ఇటువంటి చర్యలు ప్రపంచ ఇంధన సరఫరాలకు అంతరాయం కలిగిస్తాయని, చర్చల ప్రక్రియను మరింత క్లిష్టతరం చేస్తాయని హెచ్చరించింది.
కాగా, గత శుక్రవారం వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో సమావేశమైన జెలెన్‌స్కీ, రష్యా భూభాగంలోకి చొచ్చుకెళ్లి దాడులు చేసేందుకు వీలుగా సుదూర లక్ష్యాలను ఛేదించే టోమాహాక్ క్షిపణులను అందించాలని కోరగా, ట్రంప్ నిరాకరించారు. అయితే, ఆంక్షల విషయంలో మాదిరిగానే భవిష్యత్తులో క్షిపణులపై కూడా ట్రంప్ తన మనసు మార్చుకోవచ్చని జెలెన్‌స్కీ సూచనప్రాయంగా తెలిపారు. మరోవైపు, ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.