ఆస్ట్రేలియాతో తొలి వన్డే.. ఆదిలోనే భారత్‌కు ఎదురుదెబ్బ

   
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పెర్త్‌లో ప్రారంభమైన తొలి వన్డేలో భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నాలుగో ఓవర్ నాలుగో బంతికి మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (8) వికెట్‌ను కోల్పోయింది. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో రెన్షాకు క్యాచ్ ఇచ్చి రోహిత్ పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్‌రెడ్డి ఆరంగేట్రం చేశాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ గాయపడటంతో ఓపెనర్ మిచెల్ మార్ష్ జట్టును నడిపిస్తున్నాడు. ప్రస్తుతం ఐదు ఓవర్లు ముగిశాయి. భారత్ వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది. కెప్టెన్ గిల్ (5), కోహ్లీ క్రీజులో ఉన్నారు. 


More Telugu News