కనిష్ఠాల వద్ద కొనుగోళ్లు.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

  • రెండు రోజుల పాట నష్టాలు నమోదు చేసిన సూచీలు
  • కనిష్ఠాల వద్ద కొనుగోళ్లకు మదుపరుల మొగ్గు
  • లాభపడిన బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. వరుసగా రెండు రోజుల పాటు నష్టాలను చవిచూసిన సూచీలు ఈ రోజు పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయ సూచీలు లాభాలను ఆర్జించాయి. రెండు రోజులుగా మార్కెట్లు నష్టాల్లో ముగియడంతో మదుపరులు కనిష్ఠాల వద్ద కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. దీని ఫలితంగా సూచీలు లాభాల బాట పట్టాయి.

సెన్సెక్స్ 590 పాయింట్లు, నిఫ్టీ 170 పాయింట్లు లాభపడ్డాయి. రోజంతా సూచీలు లాభాల్లోనే కొనసాగాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్ అధిక లాభాలను పొందాయి. ఏషియన్ పేయింట్స్, ఎల్ అండ్ టీ, ట్రెంట్, అల్ట్రా‌టెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్ సైతం లాభాల్లో ముగిశాయి.

టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంకు మాత్రం నష్టాలను మూటగట్టుకున్నాయి. మంగళవారం అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా, ఆసియా మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. రూపాయి మారకంతో డాలర్ విలువ 88.10కి చేరింది.


More Telugu News