నాపై కొందరు కుట్ర పన్నుతున్నారు: బొత్స సత్యనారాయణ
- తనను అంతమొందించేందుకు కుట్ర జరుగుతోందన్న బొత్స సత్యనారాయణ
- సిరిమానోత్సవంలో తను పాల్గొన్న వేదిక కూలడంపై అనుమానం వ్యక్తం చేసిన బొత్స
- ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్
- గవర్నర్, సీఎంలకు లేఖ రాస్తానని వెల్లడి
వేదిక కూలిన ఘటనపై విచారణ చేపట్టాలని బొత్స డిమాండ్ చేశారు. ఈ విషయంపై గవర్నర్, సీఎంకు లేఖ రాయనున్నట్లు తెలిపారు. పైడితల్లి సిరిమానోత్సవంలో తన కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ నాయకుల కోసం ఏర్పాటు చేసిన వేదిక ఎలా కూలిందని ఆయన ప్రశ్నించారు. ఈ అంశంలో కలెక్టర్, ఎస్పీకి బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. దీని వెనుక ఎవరున్నా బయటకు లాగుతామని అన్నారు. బొత్స చేసిన ఈ సంచలన ఆరోపణలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.