నోబెల్ బహుమతి ప్రకటనకు ముందు రష్యా కీలక నిర్ణయం.. ట్రంప్‌కు మద్దతు
- ఈ పురస్కారం కోసం ట్రంప్ అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తున్నట్లు వెల్లడి
- బహుమతి ప్రకటనకు కొన్ని గంటల ముందు రష్యా కీలక ప్రకటన
- నోబెల్ శాంతి బహుమతి ట్రంప్‌కు రాకపోవచ్చని నిపుణుల అభిప్రాయం
ఈ నేపథ్యంలో నోబెల్ బహుమతి ప్రకటనకు కొన్ని గంటల ముందు రష్యా ఈ కీలక ప్రకటన చేసింది. ఈ పురస్కారం కోసం ట్రంప్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలుపుతున్నట్లు తెలిపింది. అయితే, నోబెల్ శాంతి బహుమతి ట్రంప్‌కు రాకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధం ముగింపునకు ప్రయత్నించినందుకు ట్రంప్‌పై రష్యా కృతజ్ఞతలు తెలిపింది. ఆయన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించగలిగితే కీవ్ నోబెల్‌కు నామినేట్ చేస్తుందని అన్నారు.