Krithi Shetty: పాలరాతి శిల్పానికి ఇది పరీక్షా కాలమే!
- ఎంట్రీతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న బ్యూటీ
- హ్యాట్రిక్ హిట్ తో సంచలనం
- ఆ తరువాత మారిన గ్రాఫ్
- కోలీవుడ్ పైనే ఫోకస్ పెట్టిన కృతి
తెలుగు తెరపైకి ఈ మధ్య కాలంలో టీనేజ్ లో వచ్చిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది 'కృతి శెట్టి' అనే చెప్పాలి. తన వయసుకు తగిన పాత్రలో ఆమె చేసిన 'ఉప్పెన', సంచలన విజయాన్ని నమోదు చేసింది. తొలి సినిమాతోనే 100 కోట్ల విజయాన్ని సాధించడంతో, ఈ బ్యూటీ ఎక్కడికో వెళ్లిపోతుందని అంతా అనుకున్నారు. నిజంగానే ఆ తరువాత ఆమెకి ఆ స్థాయిలోనే అవకాశాలు వచ్చాయి. అవి హిట్ చిత్రాల జాబితాలోకి చేరిపోయాయి కూడా.
అయితే ఆ తరువాత నుంచే ఆమెకి ఇక్కడ కష్టకాలం మొదలైంది. హిట్లు ఎలా వరుసగా వచ్చి వాలాయో, ఫ్లాపులు కూడా అలాగే వచ్చి పడ్డాయి. శంఖంలో పోస్తేనే తీర్థం అయినట్టు, సక్సెస్ లో ఉంటేనే ఎవరికైనా క్రేజు .. డిమాండు ఉంటాయి. అలాంటి సక్సెస్ లేకపోవడంతో కృతి కోలీవుడ్ బాట పట్టింది. అక్కడ ఉంటూనే మల్లూవుడ్ పైనా ఒక లుక్ వేసింది. అయితే మలయాళంలో ఆమెకి 'ARM'తోనే పెద్ద హిట్ పడింది. ఆమె కాస్త తేలికగా ఊపిరి పీల్చుకునేలా చేసింది.
ఇక తమిళంలో ఆమె కార్తీ సరసన నటించిన 'వా వాథియర్'ను ఈ దీపావళికి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన డిసెంబర్ 5వ తేదీకి వాయిదా పడింది. కుమారస్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. విఘ్నేశ్ శివన్ దర్శక నిర్మాతగా రూపొందించిన 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' కూడా డిసెంబర్ 18న విడుదల కానుంది. ప్రదీప్ రంగనాథ్ జోడీగా ఈ సినిమాలో ఆమె సందడి చేయనుంది. ఈ రెండు సినిమాలు ఆమె కెరియర్ కి చాలా కీలకమని చెప్పాలి. ఈ సినిమాలతో ఆమె కోలీవుడ్లో హవా కొనసాగిస్తుందేమో చూడాలి.